VIT-AP Merit Scholarships for UG Programmes
విఐటి-ఏపి
క్యాంపస్ మెరిట్ స్కాలర్ షిప్ లు
వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
టెక్నాలజీ (వీఐటీ) 2021 విద్యాసంవత్సరానికి మెరిట్ స్కాలర్ షిప్
లను ప్రకటించింది. రెండు రకాల స్కాలర్ షిన్లను అందించనున్నట్లు ఆ సంస్థ వైస్
ప్రెసిడెంట్ డా.శేఖర్ విశ్వనాథన్ తెలిపారు. బీబీఏ, లా,
బీకాం, బీఎస్సీ, బీఏ
కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు మే 31 లోపు ఇన్స్టిట్యూట్
అధికారిక వెబ్ సైట్ లో జీవీ మెరిట్, రాజేశ్వరీ అమ్మాల్
మెరిట్ స్కాలర్ షిష్ కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంస్థ అందించే అండర్
గ్రాడ్యుయేట్ ప్రోగ్రాముల్లో చేరే విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ లకు అర్హత
సాధించాలంటే జిల్లా టాప్ ర్యాంకులు పొంది ఉండాలి. ఈమేరకు విద్యార్థులకు ట్యూషన్
రుసుములో 50శాతం స్కాలర్ షిప్ అందుతుంది. అదే అమ్మాయిలైతే
అదనంగా మరో 25శాతం కలిపి 75 శాతం
స్కాలర్ షిప్ ఇస్తారు.
మరోవైపు జనరల్ మేనేజ్ మెంట్ విత్
స్పెషలైజేషన్లో భాగంగా ఈ విద్యాసంస్థ బిజినెస్ అనలిటిక్స్, ఫిటెక్
అండ్ డిజిటల్ మార్కెటింగ్, బీఏ ఎల్ఎల్‌బీ (హానర్స్), బీకాం విత్ డ్యుయల్ డిగ్రీలను అందిస్తోంది. అలాగే పబ్లిక్ సర్వీసెస్ లో
బీఏ, ఎంఏ, డేటా సైన్స్ లో బీఎస్సీ,
ఎమ్మెస్సీ కోర్సులను నిర్వహిస్తోంది.
VIT-AP
University ‘s Merit Scholarships for UG Non-engineering Courses
0 Komentar