What is the Rule Of 72 and How It Works?
రూల్ 72 అంటే ఏమిటి - ఆ రూల్ తో మీ డబ్బు ఎప్పుడు రెట్టింపు అవుతుందో ఎలా తెలుసుకోవచ్చు?
మీ పెట్టుబడులను రెట్టింపు
చేయడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవడానికి మీరు చేయాల్సిందల్లా ఈ నియమం ప్రకారం, రాబడి
రేటును 72 ద్వారా విభజించడం.
దీన్ని ఉదాహరణతో అర్థం చేసుకుందాం.
మీరు రూ. 1 లక్షను బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో 5 శాతంతో పెట్టుబడి పెట్టాలనుకున్నారు. రూ. 1 లక్ష,
రూ. 2 లక్షలు కావడానికి ఎంత సమయం పడుతుందో
తెలుసుకోవడానికి 72 ను వడ్డీ రేటు (5
శాతం) తో విభజించండి. 72/5 అంటు 14.4 సంవత్సరాలు అవుతుంది. అందువల్ల, ప్రతి 14.4 సంవత్సరాలకు, వడ్డీ
రేటు 5 శాతంగానే ఉంటే, మీ డబ్బు
రెట్టింపు అవుతుంది.
మీ ఈక్విటీ రాబడి ప్రతి సంవత్సరం సగటున 10 శాతం అయితే, మీ డబ్బు 7.2 సంవత్సరాలలో (72/10) రెట్టింపు అవుతుంది. ఈ 72 నియమం సాధారణంగా స్థిర-రేటు పెట్టుబడుల కోసం ఉపయోగపడుతుంది, ఈక్విటీల వంటి అస్థిర పెట్టుబడులకు కాదు.
ఒక నిర్దిష్ట సమయంలో మీ డబ్బును రెట్టింపు చేయడానికి ఎంత వడ్డీ రేటు అవసరమో తెలుసుకోవడానికి కూడా ఈ నియమాన్ని ఉపయోగించవచచు. ఉదాహరణకు, మీ డబ్బు రెట్టింపు కావాలంటే ఐదేళ్ళు అనుకుంటే, 72 ను 5 ద్వారా విభజించండి, ఇది 14.4 శాతం అవుతుంది. కాబట్టి, ఐదేళ్లలో మీ డబ్బును రెట్టింపు చేయడానికి మీకు 14.4 శాతం వడ్డీ రేటు ఉండాలి.
మనం చాలా మార్గాల్లో పెట్టుబడి పెడుతుంటాం. అయితే, మనం పెట్టిన డబ్బులు రెట్టింపు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అన్న సందేహం చాలా సార్లు వస్తుంటుంది? ఉదాహరణకు మీరు సగటున 12 శాతం రాబడి ఇచ్చే మ్యూచువల్ ఫండ్లలో ఒకేసారి పెద్దమొత్తంలో పెట్టుబడి పెడితే అది ఎన్ని ఏళ్లలో రెట్టింపు అవుతుంది? ఇలాంటి సందేహాలను తీర్చడం కోసం ఓ నిర్దిష్టమైన నియమం ఉంది. అదే థంబ్ రూల్ 72. దీని ద్వారా మీ డబ్బులు నిర్దిష్టమైన సమయంలో రెండింతలు కావాలంటే ఎంత శాతం రాబడి రావాలో కూడా తెలుసుకోవచ్చు!
ఏంటీ థంబ్ రూల్ 72..
ఇది బేసిక్‌గా ఓ సాధారణ గణిత సూత్రం. ఒక నిర్దిష్టమైన రాబడి ఇచ్చే పథకంలో మనం పెట్టే పెట్టుబడి ఎన్నేళ్లలో రెట్టింపు అవుతుందో చెబుతుంది. తెలుసుకోవాలంటే 72ని వచ్చే వడ్డీరేటుతో భాగిస్తే సరిపోతుంది. ఉదాహరణకు 5 శాతం రాబడి ఇచ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో రూ.లక్ష పెట్టారు. ఈ లక్ష రూపాయలు 2 లక్షలు కావడానికి ఎన్నేళ్లు తీసుకుంటుందో తెలియాలంటే 72ని 5తో భాగిస్తే సరిపోతుంది. (72/5) = 14.4 సంవత్సరాలు పడుతుంది. ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్లలో పెట్టిన పెట్టుబడి సగటున 10 శాతం రాబడి ఇస్తుంటే (72/10) 7.2 ఏళ్లలో మీరు పెట్టిన పెట్టుబడి రెండింతలు అవుతుంది.
ఈ రూల్‌ను ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు..
* ఈ సూత్రాన్ని రివర్స్ చేస్తే.. ఒక నిర్దిష్టమైన సమయంలో మన పెట్టుబడి రెట్టింపు కావాలంటే ఎంత రాబడి రావాలో కూడా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు మీరు మీ దగ్గరున్న డబ్బు ఐదేళ్లలో రెట్టింపు కావాలని అనుకుంటే.. 72ని ఐదుతో భాగించండి. (72/5) = 14.4. అంటే 14.4 శాతం రాబడి వస్తే మీ పెట్టుబడి ఐదేళ్లలో రెండింతలు అవుతుంది.
* ఇలా సమయం, వడ్డీ రేటు గనక తెలుసుకుంటే మీ ఆర్థిక అవసరాలకు సరిపడే పథకాలేంటో ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు ఒక రూ.10 లక్షలు పెట్టుబడిగా పెడదామని అనుకున్నారు. ఓ పదేళ్ల తర్వాత అది రెట్టింపు కావాలనుకుంటే థంబ్ రూల్ 72 ప్రకారం 7.2 శాతం రాబడి ఉండాలి. ఇలా 7.2శాతం రాబడినిచ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్ లేదంటే మ్యూచువల్ ఫండ్లు ఏవో చూసుకొని వాటిలో పెట్టుబడి పెట్టొచ్చు.
* చిన్న వయసులో పెట్టుబడి ప్రారంభిస్తే చిన్న వయసులోనే ఎక్కువ మొత్తంలో సంపాదించొచ్చని ఈ నియమం సూచిస్తుంది. అలాగే నష్టభయం అసలే ఉండొద్దని భావించేవారు.. తక్కువ రాబడి అయినా.. ఎక్కువ కాలం మదుపు చేస్తే సరిపోతుందని ఈ రూల్ చెబుతుంది.
ఇది కచ్చితమైన ఫలితాలు ఇస్తుందా..
ఇది 100 శాతం కచ్చితమైన ఫలితాలు ఇవ్వదు. కొంత తేడా ఉంటుంది. ఓ అంచనాకు రావడానికి
మాత్రమే ఇది ఉపయోగపడుతుంది.
కాబట్టి, మీ
సంపదను పెంచుకోవటానికి సహనం, క్రమశిక్షణ కీలకం.
0 Komentar