WhatsApp Launches Voice, Video Calling
Feature for Web Version
వాట్సాప్: ఇకపై డెస్క్‌టాప్‌లోనూ
వీడియో,
వాయిస్ కాల్స్
ఇంట్లో ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న వాట్సాప్ యాప్‌లో ఛాట్ చేస్తున్నారు. ఇంతలోగా అవతలి వ్యక్తి మీకు కాల్ చేశారు. మొబైల్ చూస్తే ఛార్జింగ్‌లో ఉంది. కంప్యూటర్‌లో ఉన్న వివరాలు చూసుకుంటూ, వాట్సాప్ వీడియో కాల్‌లో అవతలి వ్యక్తికి వివరాలు చెప్పాలి. ఇప్పుడైతే దీని కోసం సిస్టమ్, మొబైల్ రెండూ వాడాల్సిందే. అయితే ఈ ఇబ్బందులు త్వరలో మీకు ఉండవు. ఎందుకంటే డెస్క్‌టాప్ వాట్సాప్ యాప్‌లో వీడియో, వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఇన్నాళ్లూ మొబైల్ వెర్షన్‌కి మాత్రమే పరిమితమైన వీడియో, వాయిస్ కాల్ ఫీచర్ ఇప్పుడు డెస్క్‌టాప్ వాట్సాప్ యాప్‌కి కూడా వచ్చేసింది. గత డిసెంబర్‌లో ప్రయోగాత్మకంగా ఈ ఫీచర్ కొంతమందికి అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా అందరికీ అందిస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. ఒకటి, రెండు రోజుల్లో ఈ ఆప్షన్ అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఇందులో కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్ట్రిప్షన్ సాంకేతికత ఉంటుంది. దీని కోసం డెస్క్‌టాప్/ల్యాప్‌టాప్‌లో మీరు కాల్ చేయాలనుకుంటున్న కాంటాక్ట్ క్లిక్ చేసి.. దిగువ కనిపించే కాల్ బటన్ క్లిక్ చేస్తే సరి. భవిష్యత్తులో ఈ ఫీచర్‌ను విస్తరించి, గ్రూప్ కాల్స్ కూడా మాట్లాడుకునే ఆప్షన్ అందిస్తారట.
ఇక వాటికీ బ్లూటిక్ రాదు
వాట్సాప్ వాడకం మొదలైన కొత్తలో
‘బ్లూటిక్స్’ గురించి విన్నాం. అవసరమైతే ఆప్షన్‌ని ఎనేబుల్ చేసి వాట్సాప్‌ని
వాడుతున్నాం. అంటే.. ఎవరైనా పంపిన వాటిని మీరు చదివారని వారికి తెలిసేలా చేసేవే ఈ
బ్లూటిక్స్. ఒకవేళ వీటిని Read Receiptలో డిసేబుల్ చేస్తే
బ్లూటిక్స్ కనిపించవు. ఇది ఇప్పటి వరకూ కేవలం మెసేజ్‌ల వరకే పరిమితం అయ్యింది.
కానీ, ఎవరైనా వాయిస్ మెసేజ్‌లు పంపితే వాటికి అప్లై అవ్వదు.
మీరు విన్నారనే విషయం బ్లూటిక్స్‌తో వారికి తెలిసిపోతుంది. ఇప్పుడు యాపిల్
యూజర్లకు అందుబాటులోకి తెచ్చిన కొత్త అప్‌డేట్‌తో వాయిస్ మెసేజ్‌లకు కూడా
బ్లూటిక్స్ కనిపించవు. దీంతో మీరు వాయిస్ క్లిప్‌ని విన్నారనే విషయం వారికి
తెలియదన్నమాట. ఆప్షన్‌ని ఎనేబుల్ చేసేందుకు యాపిల్ యూజర్లు వాట్సాప్‌లోని Settings>Account> Privacy విభాగంలోకి
వెళ్లండి.
0 Komentar