అమ్మ ఒడి పథకం – నగదు బదులు ల్యాప్ టాప్ అందించుటకు షెడ్యూలు
•9వ తరగతి నుంచి
ఇంటర్మీడియెట్ విద్యార్థులకు అవకాశం*
•తల్లుల నుంచి అంగీకార
పత్రాల సేకరణ
• ఏప్రిల్ 26 నాటికి ప్రక్రియ పూర్తికి ఆదేశాలు
•వచ్చే విద్యా సంవత్సరానికి
విద్యార్థులకు
ల్యాప్ టాప్ అందేలా కార్యాచరణ
రూ.25 నుంచి రూ.27 వేలు ఖరీదు చేసే బ్రాండెడ్ కంపెనీ ల్యాప్ టాపు రూ.18,500లకు విద్యార్థులకు అందిస్తారు.
షెడ్యూల్ ఇదీ
•ముఖ్యమంత్రి సందేశంతో
కూడిన అంగీకార నమూన పత్రాన్ని జిల్లా విద్యాశాఖాధికారులు ముద్రించి, వాటిని ఏప్రిల్ 15 నాటికి అన్ని పాఠశాలల
ప్రధానోపాధ్యాయులకు అందించాలి.
•9 నుంచి 12 వరకు చదువుకునే విద్యార్థులను ఏప్రిల్ 19న
సమావేశపరిచి, ఆ లేఖలను ఇవ్వాలి.
•ఆ లేఖలను విద్యార్థులు
ఇంటికి తీసుకెళ్లి, తల్లి లేదా సంరక్షకుడి సంతకంతో డబ్బులు
కావాలా, లేక ల్యాప్ టాప్ తీసుకుంటారా అనే వారి అభీష్టాన్ని
తెలిపి 22వ తేదీ నాటికి హెచ్ఎంకు అందజేయాలి.
•26వ తేదీ నాటికి సమగ్ర వివరాలను అమ్మ ఒడి వెబ్ సైట్ లో పొందుపరచాలి. దీనికోసం విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
9-12
తరగతుల విధ్యార్ధులకు అమ్మఒడి పథకం ద్వారా నగదు బదులు లాప్ టాప్ అందించుట గూర్చి
ప్రొసీడింగ్స్
0 Komentar