AP: పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ - పునరాలోచించాలని
ప్రభుత్వానికి సూచన
కరోనా విజృంభిస్తున్న వేళ ఏపీలో పది, ఇంటర్ పరీక్షల నిర్వహణ అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. పరీక్షలు రద్దు చేయాలని పలువురు కోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పరీక్షల అంశంపై పునరాలోచించాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను మే 3కు వాయిదా వేసింది.
పరీక్షలంటే.. 30
లక్షల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు భాగస్వాములవుతారని..
కరోనా సోకిన విద్యార్థులకు పరీక్షలు ఎలా నిర్వహిస్తారు? అని
కోర్టు ప్రశ్నించింది. కేంద్రం నిబంధనల ప్రకారం వారు ఐసోలేషన్ లేదా ఆస్పత్రిలో
ఉండాలి అని న్యాయస్థానం పేర్కొంది. అయితే, కరోనా సోకిన
విద్యార్థులకు ప్రత్యేక గదుల్లో పరీక్షలు నిర్వహిస్తామని.. ఎలాంటి ఇబ్బందులు
లేకుండా చూస్తామని ప్రభుత్వుం కోర్టుకు వెల్లడించింది. ఇతర రాష్ట్రాల్లో పరీక్షలు
రద్దు చేశారని.. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డులు కూడా పరీక్షలు
రద్దు చేశాయని న్యాయస్థానం గుర్తుచేస్తూ.. పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం
పునరాలోచన చేయాలని సూచించింది. ఈ అంశంపై మే3లోగా అఫిడవిట్
దాఖలు చేయాలని ఆదేశించింది.
పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సీఎం సమీక్ష - పాస్ మార్కులతో
భవిష్యత్ ఉంటుందా?: సిఎం
0 Komentar