AP Covid-19 Media Bulletin 12-04-2021
ఏపీలో 3263 కొత్త కరోనా కేసులు
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 33,755 నమూనాలను పరీక్షించగా 3,263 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 654, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 19 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,28,664కి చేరింది. వీరిలో 8,98,238 మంది కోలుకున్నారు.
24 గంటల వ్యవధిలో కొవిడ్ చికిత్స
పొందుతూ 11 మంది మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో ఐదుగురు,
నెల్లూరు జిల్లాలో ఇద్దరు.. అనంతపురం, కడప,
కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు
చొప్పున మరణించారు. తాజా మరణాలతో రాష్ట్రంలో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7,311కి చేరింది. ఒక్కరోజులో 1,091 మంది కరోనా నుంచి
పూర్తిగా కోలుకోగా, ప్రస్తుతం 23,115
యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,54,63,146 నమూనాలను పరీక్షించారు.
0 Komentar