AP Covid-19 Media Bulletin 18-04-2021
ఏపీలో 6582 కొత్త కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సెకండ్ వేవ్‌లో కొవిడ్ మహమ్మారి మరింత వేగంగా వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35,922 పరీక్షలు నిర్వహించగా, 6,582 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,62,037 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 22 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరులో ఐదుగురు, కృష్ణా, నెల్లూరులో నలుగురు చొప్పున; కర్నూల్‌లో ముగ్గురు, అనంతపురం, గుంటూరులో ఇద్దరేసి; విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,410కి చేరింది.
24 గంటల వ్యవధిలో 2,343 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,09,941కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 44,686 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,56,77,992 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరులో 1,171,
అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 82 కేసులు
నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో గత మూడు రోజులుగా
వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి.
0 Komentar