AP Covid-19 Media Bulletin 19-04-2021
ఏపీలో 5963 కొత్త కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ
కొనసాగుతోంది. సెకండ్ వేవ్‌లో కొవిడ్ మహమ్మారి మరింత వేగంగా వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర
వ్యాప్తంగా 37,765 పరీక్షలు నిర్వహించగా, 5963 కేసులు నిర్ధారణ అయ్యాయి. కొవిడ్‌తో ఒక్కరోజు
వ్యవధిలో 27 మంది మృత్యువాత పడ్డారు.
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1182, అత్యల్పంగా పశ్చిమగోదావరి, విజయనగరం జిల్లాల్లో 19 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,68,000కి చేరింది.
ఒక్కరోజులో కొవిడ్ చికిత్స
పొందుతూ మృతిచెందిన వారిలో కృష్ణా జిల్లాలో ఆరుగురు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నలుగురు, గుంటూరు, కడప, కర్నూలు, ప్రకాశం,
శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరేసి..
అనంతపురం జిల్లాలో ఒకరు ఉన్నారు. 24 గంటల వ్యవధిలో 2,569 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా, ప్రస్తుతం 48,053 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,57,15,757 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.
0 Komentar