AP Covid-19 Media Bulletin 22-04-2021
ఏపీలో 10759 కొత్త కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. ఎక్కడ కూడా తగ్గకుండా రాష్ట్ర ప్రజలపై తన ప్రతాపం చూపిస్తోంది. సెకండ్ వేవ్‌లో తొలిసారి పది వేలకుపైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాకుండా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 41,871 పరీక్షలు నిర్వహించగా, 10,759 కేసులు నిర్ధారణ కాగా, 31 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,97,462 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
చిత్తూరు, కృష్ణాలో ఐదుగురు చొప్పున; కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ముగ్గురేసి; తూర్పు గోదావరి, గుంటూరు, విజయనగరంలో ఇద్దరు చొప్పున; అనంతపురం, కడప, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలో కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,541కి చేరింది. 24 గంటల వ్యవధిలో 3,992 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,22,977కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 66,944 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,58,35,169 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరులో 1,474, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 90 కేసులు నమోదయ్యాయి.
0 Komentar