AP Covid-19 Media Bulletin 27-04-2021
ఏపీలో 11,434 కొత్త కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి
కొనసాగుతోంది. రోజురోజుకీ వైరసబారిన పడుతోన్న బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది.
మృతుల సంఖ్య సైతం పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 74,435
పరీక్షలు నిర్వహించగా, 11,434 కేసులు నిర్ధారణ అయ్యాయి.
కొవిడ్‌తో విజయనగరంలో అత్యధికంగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు చొప్పున మృతి చెందగా, చిత్తూరులో ఐదుగురు, కర్నూలు, ప్రకాశం, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, వైఎస్ఆర్ కడపలో ఇద్దరు మృత్యువాతపడ్డారు.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల
సంఖ్య 7,800కి చేరింది. 24 గంటల వ్యవధిలో 7,055 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,47,629కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 99,446 యాక్టివ్ కేసులున్నాయి. అత్యధికంగా గుంటూరులో 2,028 కేసులు నమోదు కాగా, అత్యల్పంగా తూర్పు గోదావరి
జిల్లాలో 253 మంది వైరస్ బారినపడ్డారు.
0 Komentar