AP Covid-19 Media Bulletin 29-04-2021
ఏపీలో 14,792 కొత్త కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 86,035 పరీక్షలు నిర్వహించగా, 14,792 కేసులు నిర్ధారణ కాగా, 57 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 10,84,336 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,63,03,866 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
కొవిడ్‌తో అనంతపురం, విజయనగరం,
పశ్చిమ గోదావరిలో ఏడుగురు చొప్పున; తూర్పు
గోదావరిలో ఆరుగురు; చిత్తూరు, విశాఖలో
ఐదుగురు చొప్పున ప్రాణాలు కోల్పోగా.. నెల్లూరు, శ్రీకాకుళంలో
నలుగురేసి; కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున; కర్నూలులో
ఇద్దరు, గుంటూరులో ఒక్కరు మృతి చెందారు. దీంతో రాష్ట్ర
వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,928కి చేరింది. 24 గంటల వ్యవధిలో 8,188 మంది బాధితులు
కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,62,250కి చేరినట్లు
వైద్యా1,14,158 యాక్టివ్ కేసులున్నాయి. అత్యధికంగా చిత్తూరులో 1,831 కేసులు నమోదు
కాగా, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 596 మంది వైరస్
బారినపడ్డారు.
0 Komentar