టెన్త్, ఇంటర్ పరీక్షల పై రెండ్రోజుల్లో నిర్ణయం: మంత్రి ఆదిమూలపు సురేష్
ఈ నెల 14 వ తేదీన షెడ్యూల్
ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి
ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. అన్ని పాఠశాలల్లో కోవిడ్ ప్రబలకుండా జాగ్రత్తలు
తీసుకున్నామని, విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తూ
ప్రతిరోజూ పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. మున్ముందు కోవిడ్ కేసులు పెరిగితే
అప్పుడు పరీక్షల నిర్వహణపై ఆలోచిస్తామని చెప్పారు.
స్కూళ్లలో కరోనా కేసులు
పెరుగుతుండటంతో స్కూళ్లు బంద్ చేసి, పరీక్షలు రద్దు చేయాలనే
డిమాండ్లు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు సిద్ధమైనట్లు
ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, కేసులు పెరుగుతుండటంపై
పునరాలోచనలో పడింది. 'విద్యార్థుల భద్రతే ముఖ్యం. స్కూళ్లలో
రోజూ 100 పాజిటివ్ కేసులు వస్తున్నాయి. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై 2 రోజుల్లో నిర్ణయం
తీసుకుంటాం' అని మంత్రి సురేశ్ తాజాగా చెప్పారు.
Exams please cancel
ReplyDelete