ఏపీ ఎంసెట్ ఇక నుండి ఏపి ఎపాసెట్
ఏపీ ఎంసెట్ పేరును ఇకపై ఏపీ
ఇంజినీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ ఉమ్మడి ప్రవేశ
పరీక్ష (ఏపీ ఎపాసెట్)గా మార్పు చేయనున్నారు. ఈ ఏడాది ఇచ్చే నోటిఫికేషన్‌లో
ఎపాసెట్‌గానే పేర్కొననున్నారు. ఎంసెట్‌లో వైద్య విద్య పేరు ఉన్నా 2017 నుంచి
రాష్ట్రంలో నీట్ ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో పేరు మార్పు చేయాలని
ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎపాసెట్‌గా ఉన్నత విద్యామండలి
ప్రతిపాదించింది. దీనికి సంబంధించి ఉన్నత విద్యా శాఖ త్వరలో ఉత్తర్వులు జారీ
చేయనుంది. రాష్ట్రంలో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల్లో అత్యధికంగా
విద్యార్థులు హాజరయ్యే పరీక్ష ఇదే. ఏటా రెండు లక్షలకుపైగా విద్యార్థులు ఈ పరీక్ష
రాస్తున్నారు. దాదాపు 35ఏళ్లుగా ఎంసెట్ పేరుతో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు.
0 Komentar