మాస్కు లేకుంటే రూ.100 జరిమానా – హాస్టళ్లు, కోచింగ్
సెంటర్లు మూసివేత - సినిమాహాళ్లు, హోటళ్లలో దూరం తప్పనిసరి
కొవిడ్‌పై ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం
కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి సూచించారు. మాస్కు ధరించకపోతే రూ.100 జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. సినిమాహాళ్లు, ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ కేంద్రాలు, హోటళ్లలో భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలన్నారు. వీటిలో రెండు కుర్చీల మధ్య ఆరడుగుల దూరం, సినిమాహాళ్లలో రెండు సీట్ల మధ్య, ఒక సీటు ఖాళీగా ఉంచేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సమీక్షలో సీఎం పలు
నిర్ణయాలను ప్రకటించారు.
* ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు
పాఠశాలలు,
వసతిగృహాలు, శిక్షణ కేంద్రాలను మంగళవారం నుంచే
మూసివేయాలి.
* ఆసుపత్రుల్లో మంచి వైద్య
సదుపాయాలు కల్పించాలి. పరిశుభ్రంగా ఉంచాలి. వైద్యులు అందుబాటులో ఉండాలి.
* అన్ని ఆసుపత్రులకు తగినంత
ఆక్సిజన్ సరఫరా చేయాలి. విశాఖలోని ప్లాంటు నుంచి రాష్ట్రానికి రావాల్సినవాటా
సక్రమంగా అందేలా చూడాలి. అవసరమైతే ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుపై దృష్టి
పెట్టాలి.
* 104 కాల్‌సెంటర్‌ను కొవిడ్
సమస్యల పరిష్కారానికి గమ్యస్థానంగా తీర్చిదిద్దాలి.
* గ్రామాలు, వార్డుల్లో
వాలంటీర్ల ద్వారా సర్వే చేయించాలి. ఎవరైనా జ్వరంతో బాధపడుతున్నా, కొవిడ్ లక్షణాలు కన్పించినా వెంటనే పరీక్షలు నిర్వహించాలి. కొవిడ్
నిర్ధారణయిన వారితో ప్రాథమిక సంబంధాలున్న వారితోపాటు కోరుకున్న వారందరికీ పరీక్షలు
చేయాలి’ అని ఆదేశించారు.
HM& FW Department – Certain
instructions in Compliance to COVID appropriate behaviour- Issued - Reg.
G.O.Rt.No.161 Dated:20/04/2021
0 Komentar