Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: Post Offices to Sell Non-Judicial Stamp Papers

 

AP: Post Offices to Sell Non-Judicial Stamp Papers 

AP: పోస్టాఫీసుల్లోనూ స్టాంప్‌ పేపర్ల అమ్మకాలు - పోస్టల్‌’తో రిజిస్ట్రేషన్ల శాఖ MoU 

తొలి దశలో 700, రెండో దశలో 868 పోస్టాఫీసుల్లో విక్రయాలు

మూడో దశలో గ్రామస్థాయి పోస్టాఫీసులకు వెళ్లే యోచన 

రాష్ట్రంలో నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంప్‌ పేపర్స్‌ ఇకపై పోస్టాఫీసుల్లోనూ లభించనున్నాయి. ప్రజలు మరింత సులభంగా స్టాంప్‌ పేపర్స్‌ పొందేందుకు వీలుగా పోస్టాఫీసుల్లో కూడా వీటిని విక్రయించాలని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే పోస్టల్‌ శాఖతో ఎంవోయూ కుదుర్చుకుంది. రూ.10, రూ.20, రూ.50, రూ.100 డినామినేషన్ల స్టాంప్‌ పేపర్స్‌ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,952 మంది లైసెన్సు పొందిన స్టాంప్‌ వెండార్స్‌ ప్రజలకు వీటిని అమ్ముతున్నారు. కొన్నిసార్లు ఈ స్టాంప్‌ పేపర్స్‌కు కొరత ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కృత్రిమ కొరత సృష్టించడం ద్వారా వీటికి డిమాండ్‌ పెంచి.. బ్లాక్‌లో అమ్ముతున్నారనే ఆరోపణలున్నాయి. దీనికితోడు స్టాంప్‌ వెండార్స్‌ అన్ని జిల్లాల్లో ఒకే సంఖ్యలో లేకపోవడం వల్ల కొన్ని ప్రాంతాల్లో స్టాంప్‌ పేపర్స్‌ కొరత ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు సులభంగా స్టాంప్‌ పేపర్స్‌ పొందేందుకు పోస్టాఫీసులే సరైన మార్గమని రిజిస్ట్రేషన్ల శాఖ భావించి అందుకనుగుణంగా చర్యలు చేపట్టింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags