9-12 తరగతుల విధ్యార్ధులకు అమ్మఒడి
పథకం ద్వారా నగదు బదులు లాప్ టాప్ అందించుట గూర్చి ప్రొసీడింగ్స్
అమ్మఒడి కింద ల్యాప్ టాక్స్
ఎంపికకు ఐచ్ఛికాల స్వీకరణ
రాష్ట్రంలో 9-12 తరగతుల విద్యార్థులు అమ్మ ఒడి పథకం కింద నగదు లేదా ల్యాప్ టాప్
కావాలనుకునే వారు ఐచ్ఛికాలను ఇవ్వాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతోపాటు సీఎం జగన్ సంతకంతో కూడిన సందేశాన్ని విడుదల చేశారు. లేఖ చివరిలో నగదు/ ల్యాప్
టాప్ ఎంపికకు ఐచ్ఛికాల నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దీనిపై విద్యార్థి
వివరాలు ఖాళీల్లో నింపి, నగదు లేదా ల్యాప్ టాప్
తీసుకోవడానికి అంగీకరిస్తున్నామని తల్లులు, సంరక్షకులు సంతకం
చేయాల్సి ఉంటుంది. కొవిడ్ కారణంగా పాఠశాలలు, కళాశాలలు ఆన్లైన్
లో తరగతులు నిర్వహిస్తే ప్రభుత్వ బడుల్లో చదివే పేదింటి పిల్లలు చదువుకు దూరమయ్యారని
సందేశంలో సీఎం పేర్కొన్నారు. ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తున్నందున రూ.25-27 వేలు విలువ చేసే బ్రాండెడ్ ల్యాప్టాప్లు రూ.18,500కు లభిస్తాయని వెల్లడించారు.
ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు
19న విద్యార్థులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, సీఎం సందేశంలోని అంశాలను వివరించి వారికి లేఖలను అందిస్తారు. నగదు/
ల్యాప్ టాప్ ఏది కావాలో ఎంపిక చేసుకొని, తిరిగి వాటిని 24లోపు ప్రధానోపాధ్యాయులకు అందించాలి. పాఠశాల సిబ్బంది ఆ వివరాలను 26లోపు అమ్మఒడి వెబ్ సైట్లో నమోదు
చేయాల్సి ఉంటుంది.
0 Komentar