ఏపీలో నేడు రెండో డోస్
వ్యాక్సినేషన్ ప్రక్రియ
ఆంధ్రప్రదేశ్‌లో నేడు (22-04-2021)
రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉన్నందున 5 లక్షల కొవిషీల్డ్, లక్ష
కొవాగ్జిన్ డోసులు జిల్లాలకు సరఫరా చేసినట్లు ఏపీ ఆరోగ్య శాఖ కమిషనర్ భాస్కర్
తెలిపారు. మొదటి డోస్ తీసుకున్న వారు తప్పకుండా నేడు రెండో డోస్ తీసుకోవాలని సూచించారు. నేడు అందరికీ
కొవిడ్ రెండో డోస్ మాత్రమే ఇస్తారని, మొదటి డోస్ ఇవ్వరనే
విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.
శుక్రవారం నుంచి యథావిధిగా
అర్హులైన వారందరికీ టీకా పంపిణీ చేస్తామన్నారు. కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి
మే 1
నుంచి 18 ఏళ్లు దాటిన వారికి టీకా ఇచ్చేందుకు
వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధమవుతోంది. కొవిషీల్డ్, కొవాగ్జిన్
టీకాల తయారీ సంస్థలతో సంప్రదింపులు ప్రారంభించారు.
0 Komentar