Apollo Hospitals Launches COVID-19 Book of
Guidelines
ఆసుపత్రులు, వైద్య
కార్యకర్తల కోసం కొవిడ్-19 మార్గదర్శకాల పుస్తకం
అపోలో హాస్పిటల్స్ ఆవిష్కరణ
దేశంలోని అతి పెద్ద వైద్య సేవల
సంస్థ అయిన అపోలో హాస్పిటల్స్ ఆసుపత్రులు, వైద్య కార్యకర్తల కోసం
కొవిడ్-19 మార్గదర్శకాల పుస్తకాన్ని ఆవిష్కరించింది. 'కొవిడ్-19 రెడ్’ బుక్ పేరుతో
తీసుకువచ్చిన ఈ పుస్తకంలో చిన్న, మధ్య స్థాయి ఆసుపత్రులు,
వైద్యులు, వైద్య సిబ్బందికి అవసరమైన ఎన్నో
సూచనలు, సలహాలు ఉన్నాయి. రోగ నిర్ధారణ, చికిత్స, సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం, కొన్ని ప్రోటోకాల్స్, నాన్-క్లినికల్ పద్ధతులు,
ఇతర విషయాలను ఇందులో ప్రస్తావించారు.
కొవిడ్-19 వ్యాధి పూర్తిగా కొత్త. రోజు రోజుకూ పరిస్థితులు మారిపోతున్నాయి. ఇటువంటి
పరిస్థితుల్లో మనకు అవకాశం ఉన్నంత మేరకు వ్యాధి తీవ్రతను అర్ధం చేసుకుని, అత్యున్నత స్థాయి వైద్యం అందించాల్సిన అవసరం ఉంది. 'మాకు
తెలిసిన పరిజ్ఞానాన్ని వైద్య సిబ్బంది అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే ఈ
పుస్తకం ప్రధాన లక్ష్యం' అని అపోలో హాస్పిటల్స్ సంయుక్త ఎండీ
సంగీతారెడ్డి అన్నారు. వైద్య రంగంలో అపోలోకు ఉన్న 38 ఏళ్ల
అనుభవాన్ని పొందుపరచి దీన్ని సిద్ధం చేసినట్లు తెలిపారు.
0 Komentar