Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: పఠనాసక్తి పెంచేందుకు 'టాక్ ద బుక్' - ప్రతి శుక్రవారం నిపుణులతో ఆన్లైన్ సమీక్ష

 

AP:  పఠనాసక్తి పెంచేందుకు 'టాక్ ద బుక్' - ప్రతి శుక్రవారం నిపుణులతో ఆన్లైన్ సమీక్ష

విద్యార్థుల్లో పుస్తకాలు చదవడం పై ఆసక్తి పెంచేందుకు ఉన్నత విద్యామండలి 'టాక్ ద బుక్' కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ప్రతి శుక్రవారం ఒక పుస్తకంపై నిపుణులు ఆన్ లైన్ సమీక్ష నిర్వహిస్తారు. ఆ పుస్తక ప్రాధాన్యం, నిజ జీవితంలో ఉపయోగంపై వివరిస్తారు.

ఒక వారం ఆంగ్లం, మరో వారం తెలుగు పుస్తకాలను విద్యార్థులకు పరిచయం చేస్తారు. ఏప్రిల్ 23న పాఠశాల విద్యా శాఖ కమిషనర్ చిన వీరభద్రుడు ఈ సమీక్షను ప్రారంభించనున్నారు. విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో రోజువారీ అకడమిక్ ప్రణాళికలో ఒక గంట పుస్తక పఠనానికి కేటాయించాలని ఉన్నత విద్యామండలి వర్సిటీలను కోరనుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags