Bank Transactions Update! RTGS will not work between these dates
ఈ తేదీల్లో
బ్యాంక్ లావాదేవీల కోసం జరిపే ఆర్‌టీజీఎస్ సేవల్లో అంతరాయం
అధిక
మొత్తంలో లావాదేవీల కోసం జరిపే ఆర్‌టీజీఎస్ (రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్)
సేవల్లో అంతరాయం ఏర్పడనుంది. వచ్చే శనివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆదివారం (ఏప్రిల్ 18) మధ్యాహ్నం
2 గంటల వరకు అంటే 14 గంటల పాటు ఈ సేవలు
అందుబాటులో ఉండవని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గురువారం ట్విటర్ వేదికగా
వెల్లడించింది. సాంకేతిక కారణాలతోనే ఈ సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు
వెల్లడించింది.
రూ.
2లక్షలు అంతకంటే పైబడిన
లావాదేవీలకు ఆర్‌టీజీఎస్ సేవలను ఉపయోగిస్తుంటాం. అయితే, ఇందులోని
డిజాస్టర్ రికవరీ టైమ్‌ను మెరుగుపర్చేందుకు ఆర్‌టీజీఎస్ సాంకేతిక వ్యవస్థలో ఆర్‌బీఐ
మార్పులు చేపడుతోంది. గతేడాది డిసెంబరు 14 నుంచి ఆర్‌టీజీఎస్
సేవలను ఆర్‌బీఐ 24×7 అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.
‘‘ఏప్రిల్ 17న వ్యాపార వేళలు ముగిసిన తర్వాత ఆర్‌టీజీఎస్ వ్యవస్థలో సాంకేతికంగా కొత్త మార్పులు చేపడుతున్నాం. అందువల్ల ఏప్రిల్ 18న మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవు. అయితే నెఫ్ట్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి’’ - ట్విటర్‌లో ఆర్‌బీఐ.
NEFT
RTGS And IMPS - Here is How to Choose the Best Mode to Transfer Money
As technical upgrade of RBI's #RTGS is scheduled after the close of business of April 17, 2021, #RTGS service will not be available from 00:00 hrs to 14.00 hrs on Sunday, April 18, 2021. #NEFT system will continue to be operational as usual during this period for #moneytransfers.
— ReserveBankOfIndia (@RBI) April 15, 2021
0 Komentar