BECIL Recruitment 2021 for 1679
UnSkilled, Semi Skilled and Skilled Posts
బీఈసీఐఎల్ జాబ్ నోటిఫికేషన్
వివిధ విభాగాల్లో 1679 జాబ్స్ భర్తీ
ఏప్రిల్ 20
దరఖాస్తులకు చివరితేది
బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1679 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 20లోగా అప్లయ్ చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాల్లో స్కిల్డ్, అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ పోస్టులు ఉన్నాయి.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి
బీఈసీఐఎల్ ట్రైనింగ్ కోర్సును నిర్వహిస్తుంది. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసి..
ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కనీసం 50 శాతం మార్కులు సాధించిన వారికి వివిధ
ప్రభుత్వ ప్రాజెక్టుల్లో కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తారు.
విద్యార్హతలు:
Skilled Manpower: ఈ
పోస్టులకు ఎలక్ట్రికల్ ట్రేడ్, వైర్ మెన్ తదితర విభాగాల్లో
ఐటీఐ సర్టిఫికేట్ పొందిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. NCVT, SCVT నుంచి గుర్తింపు పొంది ఉండాలి. ఎలక్ట్రికల్స్ లో రెండేళ్ల అనుభవం ఉండాలి.
Un Skilled Manpower: ఈ
పోస్టులకు ఏదైనా స్టేట్ బోర్డులో 8వ తరగతి పాసైన్ వారు ఈ
ఉద్యోగాలకు అర్హులు. ఎలక్ట్రికల్ విభాగంలో ఏడాది పాటు అనుభవం ఉండాలి.
Semi Skilled Manpower: ఈ
పోస్టులకు ఇంటర్/12వ తరగతి పాసై ఉండాలి. దీంతో పాటు డీసీఏ,
పీజీడీసీఏ కోర్సుల్లో ఏడాdr కోర్సు చేసి
ఉండాలి. ఇంగ్లిష్, హింది టైపింగ్ పై అవగాహన, అనుభవం ఉండాలి. పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో చూడొచ్చు.
ఇలా అప్లయ్ చేసుకోండి:
ఈ పోస్టులకు సంబంధించి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో https://www.beciljobs.com/ వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హత, అనుభవానికి సంబంధించిన సర్టిఫికెట్లు, రెండు పాస్ పోర్టు సైజ్ ఫొటోలు, పాన్ కార్డు, ఆధార్ కార్డుకు సంబంధించిన సెల్ఫ్ అటెస్టెడ్ ఫొటో కాపీలను అప్ లోడ్ చేయాలి.
పరీక్ష ఫీజు: జనరల్, ఓబీసీ
అభ్యర్థులు రూ. 590 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు
పరీక్ష ఫీజును రూ. 295 గా నిర్ణయించారు.
ఎంపిక: ఈ పోస్టులను రాత పరీక్ష, ఇంటర్వ్యూల
ద్వారా ఎంపిక చేస్తారు.
వేతనం: పోస్టులను బట్టి రూ.16,000 నుంచి రూ.37,500 వరకు ఉంటుంది.
0 Komentar