CBSE Responds as Over 1 Lakh Students
Want Board Exams Cancelled: Report
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షల నిర్వహణ - ‘పరీక్షలు రద్దు’పై స్పష్టం
చేసిన సిబిఎస్‌ఈ
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి వార్షిక పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. దీనిపై స్పందించిన సీబీఎస్‌ఈ.. విద్యార్థుల కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నామని, కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా మే నెలలో జరగబోయే బోర్డు పరీక్షలు రద్దు చేయాలని, లేదా వాటిని ఆన్‌లైన్‌లో నిర్వహించాలని సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి విద్యార్థులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు దాదాపు లక్షమందికి పైగా విద్యార్థులు ఆన్‌లైన్ పిటిషన్‌పై సంతకాలు చేశారు. గత రెండు రోజులుగా #cancelboardexams2021 హ్యాష్‌ట్యాగ్ ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది. ‘‘దేశంలో తక్కువ కేసులు ఉన్న గతేడాది పరీక్షలు రద్దు చేశారు. ఇప్పుడు కేసులు తారాస్థాయికి చేరుతుంటేనేమో పరీక్షలు నిర్వహించాలని చూస్తున్నారు. ఈ అంశాన్ని పరిశీలించి ఈ ఏడాది జరగబోయే వార్షిక పరీక్షలను రద్దు చేయాలని విద్యాశాఖ మంత్రిని కోరుతున్నాం. ఇప్పటికే విద్యార్థులమంతా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాం’’ అని ఓ పిటిషన్‌లో పేర్కొన్నారు.
అయితే ఈ పిటిషన్లపై సీబీఎస్‌ఈ సీనియర్ ఉద్యోగి ఒకరు స్పందించారు. ‘‘విద్యార్థుల భద్రత కోసం పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే పరీక్షా కేంద్రాలను కూడా 40 నుంచి 50శాతం పెంచాం. నిబంధనలు పాటించేలా సిబ్బందికి ప్రత్యేకంగా సూచనలు చేస్తున్నాం’’ అని వెల్లడించారు.
కరోనా కారణంగా ప్రాక్టికల్
పరీక్షలకు హాజరుకాలేని విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని గతవారం
సీబీఎస్‌ఈ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే థియరీ పరీక్షలకు కూడా అదే మినహాయింపు
కల్పిస్తారా లేదా అన్నది సదరు అధికారి వెల్లడించలేదు. మరోవైపు షెడ్యూల్ ప్రకారం
వార్షిక పరీక్షలు యథావిధిగా జరుగుతాయని సీఐఎస్‌సీఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్, సెక్రటరీ
గెర్రీ అరాథూన్ తెలిపారు.
0 Komentar