కేంద్ర కార్యాలయాల్లో సగం సిబ్బందే
- ఆఫీసు ప్రారంభ, ముగింపు వేళల్లో స్వల్ప మార్పులు
కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ
కార్యాలయాల్లో ఉద్యోగుల సంఖ్యను 50%కే పరిమితం చేయాలని సిబ్బంది
వ్యవహారాలశాఖ పేర్కొంది. అండర్‌సెక్రెటరీ, అందుకు సమానమైన
హోదాలో ఉన్న అధికారులు, మిగిలిన సిబ్బంది హాజరును 50%కే పరిమితం చేయాలని స్పష్టం చేసింది. డిప్యూటీ సెక్రెటరీ, అందుకు సమానమైన హోదాగల అధికారులు మాత్రం రోజూ కార్యాలయాలకు రావాలని
నిర్దేశించింది. ఆఫీసు ప్రారంభ, ముగింపు వేళల్లో ఎక్కువ
రద్దీ లేకుండా షిఫ్టులను మూడురకాలుగా మార్చారు. కంటెయిన్‌మెంట్ జోన్‌లలో నివాసం
ఉండే సిబ్బంది దాన్ని డీనోటిఫై చేసేంత వరకూ ఆఫీసుకు రావొద్దని అధికారులు
సూచించారు.
మూడు రకాల షిఫ్టుల సమయాలు:
9.00 A.M. to 5.30. P.M.
9.30 AM to 6.00 PM.
10.00 A.M. to 6.30 P.M.
0 Komentar