Covid Treatment - ArogyaSree Hospitals –
Clarification on length of stay of COVID cases in NWH Hospitals
కోవిడ్ నుంచి కోలుకున్నా, 14
రోజుల తరువాతే పేషెంట్ లను డిశ్చార్జ్
చేస్తున్న కొన్ని ఆరోగ్య శ్రీ ఆసుపత్రి లకు కోవిడ్ తగ్గిన వెంటనే డిశ్చార్జ్
చేయాలని సూచనలు.
కొవిడ్ చికిత్స పూర్తయినా రోగులను
డిశ్చార్జ్ చేయని కొన్ని నెట్‌వర్క్ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నోటీసులు
జారీ చేసింది. చికిత్స పూర్తి చేసుకున్నప్పటికీ 10-14 రోజుల పాటు
రోగులను ఉంచేసి ఆరోగ్యశ్రీ ఖాతాల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నాలు
జరుగుతున్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. రోగి
కోలుకున్నప్పటికీ డిశ్చార్జ్ చేయకుండా ఉంచేయటంతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఈ నోటీసులు
ఇచ్చింది. వాస్తవానికి రోజువారీ ట్రీట్ మెంట్ విధానంలో ఆస్పత్రులకు చెల్లింపులు
జరపాల్సిందిగా టెక్నికల్ కమిటీ సిఫార్సు చేసింది. దీన్ని అమల్లోకి
తీసుకువచ్చినప్పటికీ .. కొన్ని ఆస్పత్రులు అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా
ఫిర్యాదులు రావటంతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. కోలుకున్న రోగులను
తక్షణమే డిశ్చార్జ్ చేయాల్సిందిగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో ఆదేశాలు జారీ
చేశారు.
Cir. No. 03 Dr. YSR AHCT/Operations/COVID/2021,
Dated: 25.04.2021
Sub: Dr. YSR AHCT – Clarification on
length of stay of COVID cases in NWH Hospitals – Reg.
0 Komentar