జూన్ 1 వరకు డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షల నిలిపివేత - రవాణా కమిషనర్ ఆదేశాలు జారీ
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం (ఈనెల 27) నుంచి మే నెలాఖరు వరకు రవాణాశాఖ కార్యాలయాల్లో ఎల్‌ఎల్‌ఆర్, డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలను నిలిపివేస్తూ రవాణా కమిషనర్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు సోమవారం ఆదేశాలు జారీచేశారు. ఈ తేదీల్లో పరీక్షకు స్లాట్లు పొందినవారికి, జూన్ ఒకటి తర్వాత నుంచి వేరే తేదీల్లో సర్దుబాటు చేయనున్నారు.
త్రైమాసిక పన్ను చెల్లింపు గడువు పెంపు:
తొలి త్రైమాసిక మోటారు వాహన ముందస్తు పన్ను చెల్లింపు గడువును రెండు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పన్ను చెల్లింపు గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుండగా, మరో రెండు నెలలు పొడిగించాలని ఏపీ లారీ యజమానుల సంఘం ఇటీవల అభ్యర్థించింది. దీంతో జూన్ నెలాఖరు వరకు అపరాధ రుసుము లేకుండా పన్ను చెల్లించే వెసులుబాటు ఇస్తూ రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఆదేశాలు ఇచ్చారు.
0 Komentar