గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై ఏకంగా
రూ. 800 వరకు క్యాష్ బ్యాక్
కరోనా నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు
ఎదుర్కొంటున్న అనేక మంది సామాన్యులు ఇంత ధర పెట్టి సిలిండర్ ను బుక్ చేయడానికి
ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ తరుణంలో ప్రమఖ పేమెంట్స్ యాప్ పేటీఎం(Paytm) గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై
ఏకంగా రూ. 800 వరకు క్యాష్ బ్యాక్ అందించనున్నట్లు
ప్రకటించింది. అంటే ఈ ఆఫర్ ద్వారా సిలిండర్ ను వంద లోపే సొంతం చేసుకోవచ్చు. పెరిగిన ధరల నేపథ్యంలో ఇది సూపర్ ఆఫర్ అని చెప్పొచ్చు.
అయితే క్యాష్ బ్యాక్ పొందాలని భావించే వారు పేటీఎం ద్వారా తొలి సారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలి. వీరికే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇంకా క్యాష్ బ్యాక్ మొత్తం రూ.10 నుంచి రూ.800 వరకు ఉంటుంది. అంటే ఈ మధ్యలో మీకు ఎంతైనా క్యాష్ బ్యాక్ రావొచ్చు. ప్రతి ఒక్కరికీ రూ.800 వస్తుందని చెప్పడానికి లేదు.
కొంత మందికి రూ.10
రావొచ్చు, ఇంకొత మందికి రూ.100
రావొచ్చు లేదంటే రూ.800 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా ఎంత
డబ్బు అయినా క్యాష్ బ్యాక్ రూపంలో వచ్చే ఛాన్స్ ఉంది. గ్యాస్ సిలిండర్ బుక్
చేసుకున్న తర్వాత స్క్రాచ్ కార్డు వస్తుంది. ఇందులో మీకు ఎంత క్యాష్ బ్యాక్
వచ్చింది ఉంటుంది. క్యాష్ బ్యాక్ డబ్బులు మీ పేటీఎం వాలెట్‌కు 48 గంటల్లోగా వచ్చి యాడ్ అవుతుంది.
1.మొదట మీరు మీ మొబైల్ ఫోన్‌లో
పేటీఎం యాప్ లేక పోతే డౌన్‌లోడ్ చేసుకుని ఇన్ట్సాల్ చేసుకోవాలి.
2.అనంతరం రీఛార్జ్&పే బిల్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అనంతరం బుక్ గ్యాస్ సిలిండర్ ఆప్షన్
పై క్లిక్ చేయాలి.
3. అక్కడ మీరు మీ గ్యాస్
ప్రొవైడర్ ను ఎంచుకోవాలి.
4.అనంతరం మీ ఐడీ లేదా
మొబైల్ నంబర్ ను నమోదు చేసి గ్యాస్ బుక్ చేయాలి.
5. బుక్ చేసిన 24 గంటల్లో మీకు క్యాష్‌బ్యాక్ స్క్రాచ్ కార్డ్ లభిస్తుంది.
6.ఈ స్క్రాచ్ కార్డును 7 రోజుల్లో
ఉపయోగించాలి.
7. ఆ విధంగా మీకు రూ. 800 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
8. క్యాష్ బ్యాక్ మొత్తం
రూ. 10 నుంచి రూ. 800 వరకు ఉంటుంది.
9.అయితే పేటీఎం ద్వారా
మొదటి సారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
10. ఈ ఆఫర్ ఈ నెల (April) 30వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
0 Komentar