CPS ఉద్యోగి తన PRAN
అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఏమి చేయాలి...?
మొదటగా ప్లే స్టోర్ లోకి వెళ్లి NPS మోబైల్ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత PRAN నెంబర్, పాస్ వర్డ్ లను నమోదు చేస్తే మీ PRAN
అకౌంట్లో జమ అయిన అమౌంట్ వివరాలు తెలుసుకోవచ్చు.
CPS I-PIN (పాస్ వర్డ్)
బ్లాక్ అయితే ఏమి చేయాలి. మీ PRAN నెంబర్ ఉండి పాస్వర్డ్
మరచిపోయినట్లయితే ఏమి చేయాలి?
మీరు ఇంతవరకు ఒక్క సారి కూడా
లాగిన్ కాకపోయినా,PRAN నంబర్ ఉండి పాస్ వర్డ్ మరిచిపోయిన PRAN
ఎవరికీ పంపవలసిన అవసరం లేదు.
సబ్ స్క్రైబర్ తనకు తానే క్రింది
స్టెప్స్ పాటించి I-PIN (పాస్ వర్డ్) రీసెట్ చేసుకోవచ్చు.
★ ముందుగా NPS యాప్
ఓపెన్ చేసి లాగిన్ ప్రెస్ చేసి PRAN నంబర్ నమోదు చేసి Reset
Password? ను క్లిక్ చేయాలి.
★ USING OTP ని సెలెక్ట్ చేయాలి.
★ తర్వాత ఇవ్వబడిన ఖాళీలలో
PRAN
Date of Birth
New Pass word
Confirm New Password
Calculate and enter captcha
మొదలైన
వివరాలను పూరించి Generate OTP ను క్లిక్ చేయాలి.
(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం PRAN
కార్డ్ లోని సమాచారంతో సరిపోవాలి.)
★ మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు OTP పంపినట్లు వచ్చిన సమాచారాన్ని OK చేయాలి.
★ రిజిస్టర్డ్ మోబైల్ కు వచ్చిన ఆరు అంకెల
పాస్ వర్డ్ నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
★ I-PIN (పాస్ వర్డ్) రీసెట్ అయినట్లు
వస్తుంది.
★ బ్యాక్ వచ్చి తిరిగి యాప్ లో PRAN, పాస్ వర్డ్ నమోదు చేసి లాగిన్ అయ్యి మన అకౌంట్ లో ఎన్ని డబ్బులు ఉన్నాయో
తెలుసుకోవచ్చును.
(పైన తెలుపబడిన సమాచారాన్ని
స్టెప్ బై స్టెప్ స్క్రీన్ షాట్స్ ద్వారా కింద ఇవ్వబడిన PDF ఫైల్
లో చూపబడింది.)
0 Komentar