మే ఐదో తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు – ఏప్రిల్ 29, 30 తేదీల్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ కు అవకాశం
ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల్లో కరోనా లక్షణాలున్న
వారికి ప్రత్యేక గదులను ఏర్పాటు చేయనున్నారు. వీటిల్లో విధులు నిర్వర్తించే
ఇన్విజిలేటర్లకు పీపీఈ కిట్లు అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మే ఐదో తేదీ
నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 10.66లక్షల మంది పరీక్షలకు
హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రం లోకి ప్రవేశించే సమయంలో విద్యార్థులకు థర్మల్
స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద కొవిడ్-19 అధికారిని నియమిస్తున్నారు. జిల్లా స్థాయిలోనూ ప్రత్యేకంగా మరో అధికారి
ఉంటారు.
పరీక్షల ఏర్పాట్లపై ఇంటర్
విద్యామండలి ఇప్పటికే ప్రామాణిక విధివిధానాలను కళాశాలల ప్రిన్సిపాళ్లకు పంపింది.
ఒక్కో గదిలో 20మంది విద్యార్థులు కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
గురు, శుక్రవారాల్లో పరీక్షల హాల్ టికెట్లను వెబ్ సైట్ లో
అందుబాటులో ఉంచనున్నారు. విద్యార్థులు వీటిని నేరుగా డౌన్లోడ్ చేసుకొని, పరీక్షలకు హాజరు కావొచ్చు.
2024112908
ReplyDelete