JNTUH: UG (బీటెక్, బీఫార్మసీ), PG (ఎంటెక్, ఎంఫార్మసీ,
ఎంబీఏ, ఎంసీఏ) తొలి
ఏడాది మొదటి సెమిస్టర్ పరీక్షలు రద్దు – రెండవ సెమిస్టర్ షెడ్యూల్ విడుదల
బీటెక్ తొలి ఏడాది విద్యార్థులకు ప్రస్తుతానికి మొదటి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించకుండానే రెండో సెమిస్టర్‌లోకి పంపించాలని హైదరాబాద్ జేఎన్టీయూ నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి రెండో సెమిస్టర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇదే విధానం ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తొలి ఏడాది విద్యార్థులకూ వర్తింపజేయనుంది.
వీరికి ఈ నెల 26 నుంచి తరగతులు
ప్రారంభమవుతాయి. దీనికి తగ్గట్టుగా 2020-21 విద్యా సంవత్సరాన్ని
రెండు వారాలు ముందుకు జరిపింది. సవరించిన షెడ్యూల్‌ను సోమవారం ప్రకటించింది.
తరగతులు పూర్తిగా ఆన్ లైన్ లో జరగనున్నాయి. కళాశాలలు పునఃప్రారంభించాక మొదటి
సెమిస్టర్ పరీక్షలు, ల్యాబ్ వర్క్ నిర్వహించనున్నట్లు
రిజిస్టార్ మంజూర్ హుస్సేన్ తెలిపారు.
బీటెక్ లో 4 -. ఎంటెక్ లో 7 కొత్త కోర్సులు
జేఎన్‌టీయూలో 2021-22 సంవత్సరానికి కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. బీటెక్ లో నాలుగు,
ఎంటెక్ లో ఏడు కోర్సులు అనుమతించేందుకు నిర్ణయించింది. ఏఐసీటీఈ సూచన
మేరకు వీటిని తీసుకువస్తున్నట్లు జేఎన్‌టీయూ సోమవారం ప్రకటించింది. ఆయా కోర్సులు
కావాలనుకునే కళాశాలలు నేరుగా 18లోగా ఏఐసీటీఈకి దరఖాస్తు
చేసుకోవాలని రిజిస్టార్ మంజూర్ హుస్సేన్ తెలిపారు.
బీటెక్ కొత్త కోర్సులు: సీఎస్ఈ
విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- డాటా సైన్స్, కంప్యూటర్ సైన్స్
అండ్ డిజైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-మెషిన్ లెర్నింగ్ -
మెకానికల్ విభాగంలో ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్
ఎంటెక్ లో కొత్త కోర్సులు: సీఎస్ఈ
విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటా సైన్స్, సైబర్
సెక్యూరిటీ. - సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో సివిల్ ఇంజినీరింగ్(కంప్యూటర్ ఎయిడెడ్
స్టక్చరల్ ఇంజినీరింగ్).
0 Komentar