Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Meal Services Banned in Domestic Flights Under 2 Hours

 

Meal Services Banned in Domestic Flights Under 2 Hours

దేశీయ విమానాల్లో ‘భోజన సేవలు నిషేధం

దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ దూరం ప్రయాణించే విమానాల్లో భోజనసేవలలను నిలిపివేసింది. ఏప్రిల్‌ 15 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. 

కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో గతేడాది కేంద్రం దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మే 25 నుంచి దశల వారీగా ఈ సేవలను పునరుద్ధరించింది. కానీ, దేశీయ విమానాల్లో భోజన సేవలను అనుమతించలేదు. ప్రయాణికులు సొంతంగా ఆహారపదార్థాలను కూడా తీసుకురావొద్దని పేర్కొంది. ఆగస్టు 31 తర్వాత కొన్ని షరతులతో ఈ భోజన సదుపాయాలను మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. 

అయితే ఇటీవల కొద్ది రోజులుగా దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భోజన సేవలపై పౌర విమానయాన శాఖ నేడు సమీక్ష నిర్వహించింది. రెండు గంటల కంటే తక్కువ సమయం ప్రయాణించే విమానాల్లో ఈ సేవలపై నిషేధం విధించింది. ‘‘దేశీయంగా విమాన సేవలు అందించే ఎయిర్‌లైన్లు రెండు గంటలు అంతకంటే ఎక్కువ సమయం ప్రయాణించే విమానాల్లో మాత్రమే భోజన సేవలను అందించాలి’’ అని మంత్రిత్వ శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్‌ ముప్పు పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags