దేశంలో కరోనా ఉద్ధృతి, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జాతినుద్దేశించి మోదీ ప్రసంగం
దేశంలో కరోనా ఉద్ధృతి, ప్రస్తుత
పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు . కొవిడ్
పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నందున ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్,
రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. మరికొన్నిచోట్ల వీకెండ్ లాక్‌డౌన్
విధించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఏం
మాట్లాడనున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం లోని
ముఖ్యాంశాలు:
* కొవిడ్ రెండో వేవ్
తుపానులా విరుచుకుపడుతోందని, ఈసారి అది మరింత తీవ్రమైన
సవాలు విసురుతోందని అన్నారు.
* కొన్నాళ్లుగా కఠినమైన పోరాటం
చేస్తున్నామని చెప్పారు.
* కరోనా సంక్షోభం నుంచి మనం తప్పక
బయటపడాలన్నారు.
* దేశంలో అన్ని వర్గాల ప్రజలు
అప్రమత్తం కావాల్సిన సమయమిది.
* ఎలాంటి పరిస్థితినైనా
ఎదుర్కొనేందుకు సిద్ధపడాలి.
* దేశం నలుమూలలా ఆక్సిజన్ కొరత
ఉంది. ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాం.
సరిపడా ఆక్సిజన్ ఉత్పత్తి కోసం అనే ప్లాంట్లు నెలకొల్పాం.
* వైద్య అవసరాల కోసం ఉత్పత్తి
పెంచాం. ఫార్మా సంస్థలు త్వరితగతిన ఔషధాల ఉత్పత్తిని పెంచాయి. ప్రపంచంలోనే
ప్రఖ్యాతిగాంచిన ఔషధ సంస్థలు భారత్‌లో ఉన్నాయి. కరోనా రెండో దశలో ఔషధాల కొరత లేదు.
* దేశాన్ని లాక్‌డౌన్ నుంచి
కాపాడాలి. లాక్‌డౌన్‌ను చివరి అస్త్రంగానే పరిగణించాలి’’ అని చెప్పారు.
0 Komentar