Madhya Pradesh Govt Announces Summer
Vacations for Classes 1 To 8
విద్యార్థులకు 2
నెలల పాటు వేసవి సెలవులు - మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక
నిర్ణయం
మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు రెండు నెలల పాటు వేసవి సెలవులను మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
విద్యార్థులకు 2
నెలల పాటు వేసవి సెలవులు
1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి
తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. సెకండ్ వేవ్ ప్రారంభం నుంచే తీవ్ర స్థాయిలో
విజృంభిస్తోంది. ఈ ప్రభావం అనేక రాష్ట్రాల్లో విద్యాసంస్థలు సైతం మూతపడిన విషయం
తెలిసిందే. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు రెండు నెలల పాటు వేసవి సెలవులను మధ్యప్రదేశ్
ప్రభుత్వం ప్రకటించింది.
విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పార్మర్ తెలిపారు. విద్యార్థులకు సెలవులు ఇచ్చినప్పటికీ బోర్డ్ పరీక్షలు పూర్తయ్యే వరకూ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎవరు తన టీచింగ్ హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని మంత్రి స్పష్టం చేశారు.
ప్రభుత్వ, ఎయిటెడ్ పాఠశాలలకు ఏప్రిల్ 15 నుంచి జూన్ 13వ తేదీ వరకూ సెలవులను ప్రకటించింది. ఏప్రిల్ 30 వరకూ ఆన్‌లైన్ బోధన చేసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర హాస్టళ్లన్నింటికీ తక్షణమే వర్తిస్తాయని పేర్కొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాధికారులు, జిల్లా ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు, ప్రినిపాల్స్‌కు ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసినట్టు చెప్పారు.
0 Komentar