Night Curfew and Sunday lockdown in
Tamil Nadu from April 20
తమిళనాడులో ఏప్రిల్ 20 నుండి నైట్ కర్ఫ్యూ మరియు ఆదివారం పూర్తి లాక్‌డౌన్ - బిహార్‌లో కూడా రాత్రి
కర్ఫ్యూ
దేశంలో కరోనా సెకండ్‌వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి తమిళనాడు, బిహార్ వచ్చి చేరాయి. తమిళనాడులో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4గంటల వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ప్రజా, ప్రైవేటు రవాణా, ఆటోలు, ట్యాక్సీలు ఏవీ తిరగడానికి వీల్లేదు. ఆదివారం పూర్తి లాక్‌డౌన్ విధించారు.
ఏప్రిల్ 20వ తేదీ నుంచి బీచ్‌లు, పార్క్‌ల్లోకి ప్రజలకు అనుమతి లేదు. కరోనా కేసులు పెరుగుతుండటంతో 12వ తరగతి పరీక్షలు వాయిదా వేశారు. నీలగిరి, కొడైకెనాల్ సహా పలు పర్యాటక ప్రాంతాల్లోకి ఎవరినీ అనుమతించమని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.
బిహార్‌లో కూడా రాత్రి కర్ఫ్యూ
బిహార్‌లో రాత్రి కర్ఫ్యూ
విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ తెలిపారు. రాత్రి 9గంటల
నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగనుంది. పాఠశాలలు,
కళాశాలలు, కోచింగ్ సెంటర్లను మే 15వ తేదీ వరకూ మూసి వేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఆలయాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు సైతం మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ
కార్యాలయాల్లో మూడోవంతు ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరు కావాలని స్పష్టం చేశారు.
దుకాణాలు, మండీలు, వ్యాపార సంస్థలు
సైతం సాయంత్రం 6దాటిన తర్వాత మూసివేయాల్సిందిగా ఆదేశించారు.
0 Komentar