ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పరిశీలన
పూర్తి – సేకరించిన వివరాలు ఇవే
ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ పొందుతున్న ఎయిడెడ్ పాఠశాలల్లో స్థితిగతులపై జిల్లా వ్యాప్తంగా 357 పాఠశాలల్లో పరిశీలన జరిగింది. ఒక ఎంఈఓ, గెజిటెడ్ హోదా కలిగిన ప్రధానోపాధ్యాయుడు వెళ్లి పాఠశాలలను క్షుణ్ణంగా పరిశీలించారు. తాజా పరిస్థితిపై ఫొటోలు తీసుకున్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను పూర్తిగా ప్రభుత్వమే నిర్వహించాలనుకుంటోంది. అందులో భాగంగానే ఈ పరిశీలన జరిగిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. పాఠశాలల స్థలాలకు విలువ బాగా ఉండటంతో యాజమాన్యాలు మాత్రం వాటి నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకోవటానికి ఇష్టపడటం లేదు.
ఏం సేకరించారంటే
పాఠశాల నడిపే ప్రదేశం, ఎప్పటి
నుంచి పనిచేస్తోంది, కరస్పాండెంట్, అక్కడ
పనిచేస్తున్న బోధన, బోధనేతర ఉద్యోగుల వివరాలు, వాటిల్లో శాంక్షన్డు పోస్టులు, వారికి చెల్లిస్తున్న
జీతభత్యాలు, పిల్లల ప్రవేశాలు, అది
మైనార్టీ విద్యా సంస్థా? నాన్ మైనార్టీ విద్యా సంస్థా?
అనేవి సేకరించారు. విద్యా సంస్థల్లో నెలకొన్న మరుగుదొడ్లు (బాల,
బాలికలకు ఎన్ని ఉన్నాయి), తరగతి గదులు,
ప్రస్తుతం భవనాల పరిస్థితి ఎలా ఉంది? పాఠశాలలో
ఎన్ని తరగతులు ఎయిడ్‌తో నడుస్తున్నాయి, భవనాలకు
చెల్లిస్తున్న అద్దెలు, కరెంటు బిల్లులు, టెలిఫోన్ బిల్లుల వివరాలు, గ్రంథాలయాల్లో ఉన్న
రిఫరెన్స్ పుస్తకాలు- వాటి కొనుగోళ్లకు వెచ్చించిన మొత్తం, ప్రయోగశాలలో
ఉన్న పరికరాల వివరాలు సేకరించారు.
0 Komentar