గురుకుల విద్యార్థులకు యాప్ ద్వారా ఆన్లైన్లో పాఠ్యాంశాలు
ప్రతిరోజూ రీటుమి యాప్ ద్వారా
గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఆన్లైన్ లో పాఠ్యాంశాలను బోధించనున్నట్లు రాష్ట్ర
గురుకులాల కార్యదర్శి శ్రీకాంత్ ప్రభాకర్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేటలోని
బాలికల గురుకుల పాఠశాలను ఆయన శుక్రవారం సందర్శించారు.
ఈ సందర్భం గా మాట్లాడుతూ
రాష్ట్రంలోని 190 గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 1100 అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఏకలవ్య
పాఠశాలల్లో 118 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశామని
చెప్పారు.
గురుకుల పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం లో నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో విద్యార్థులను గ్రేడ్లుగా విభజించి 50 రోజుల పాటు బేన్లైన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
0 Komentar