ఫార్మా-డీ కోర్సు విద్యార్థులకు
నాలుగేళ్ల బోధన రుసుములను మాత్రమే చెల్లించాలి – ఏపి ఉన్నత విద్యా శాఖ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటు కళాశాలల్లో ఫార్మా-డీ కోర్సు చదివే విద్యార్థులకు నాలుగేళ్ల బోధన రుసుములను మాత్రమే చెల్లించాలని ఉన్నత విద్యా శాఖ నిర్ణయించింది. మిగతా రెండేళ్ల ఫీజు విద్యార్థులే భరించాలి. ఫార్మా-డీ ఆరేళ్ల సమీకృత కోర్సు. చివరి రెండేళ్లను పోస్టుగ్రాడ్యుయేషన్ (పీజీ) గా ఉన్నత విద్యా శాఖ నిర్ణయించింది. మొదటి నాలుగేళ్లు అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) గా తీసుకొని బోధన రుసుములు చెల్లిస్తారు.
ప్రైవేటు
కళాశాలల్లో పీజీ చదివే వారికి రుసుములను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించిన
నేపథ్యంలో ఈ కోర్సును రెండుగా విభజించారు. ఇందుకు సంబంధించి ఉన్నత విద్యాశాఖ
త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. రాష్ట్రంలో ప్రభుత్వం నిర్ణయించిన బోధన రుసుముల
ప్రకారం ఆయా కళాశాలలను అనుసరించి రెండేళ్లకు రూ.70వేల నుంచి రూ.1.40
లక్షల వరకు విద్యార్థుల తల్లిదండ్రులు భరించాల్సి ఉంటుంది.
0 Komentar