Prescribing the Rate for CT/HRCT Test in
all the Diagnostic Centres, Scanning Centres and Hospitals in the State
కరోనా బాధితులకు చేసే CT Scan ధర నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం
కొవిడ్ సంక్షోభాన్ని ఆసరాగా తీసుకుని ప్రైవేటు ఆస్పత్రులు, స్కానింగ్ కేంద్రాల్లో చేసే పరీక్షలపై అధికంగా వసూలు చేస్తున్న వారిపై ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కరోనా బాధితులకు చేసే సీటీ స్కాన్, హెచ్‌ఆర్ సీటీ స్కాన్‌ల పేరుతో చేసే దోపడీకి అడ్డుకట్ట వేసింది. ఈ మేరకు సీటీ స్కాన్ ధరను నిర్ణయిస్తూ రాష్ట్ర సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ అనుమానితులకు సీటీ లేదా హెచ్‌ఆర్ సీటీ స్కానింగ్‌కు గరిష్ఠంగా రూ.3వేలుగా ధరను నిర్ణయించింది.
స్కానింగ్ సమయంలో వాడే పీపీఈ
కిట్లు,
మాస్కు, స్ప్రెడ్ షీట్లతో కలిపి ఈ ధరను
నిర్ణయించినట్లు ఆదేశాల్లో పేర్కొంది. ఎట్టి పరిస్థితుల్లో రూ.3వేల కంటే ఎక్కువ ఫీజు వసూలు చేయకూడదని స్పష్టం చేసింది. స్కానింగ్ అనంతరం
అనుమానితుల వివరాలను కొవిడ్ డాష్ బోర్డు వెబ్‌సైట్లో తప్పక నమోదు చేయాలని
ఆదేశించింది. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్యం, కుటుంబ
సంక్షేమ శాఖ కమిషనర్, అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం
ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు ఆస్పత్రులు, స్కానింగ్
కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తూ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు
తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
H.M & F.W. DEPT -COVID-19 –
Prescribing the Rate for CT/HRCT Test in all the Diagnostic Centres, Scanning
Centres and Hospitals in the State – Orders – Issued.
G.O.MS.No. 47 Dated: 25-04-2021.
0 Komentar