RBI Doubles Deposit Limit of Payments
Banks To ₹2 Lakh
పేమెంట్స్ బ్యాంక్ డిపాజిట్ పరిమితిపై
ఆర్‌బీఐ కీలక నిర్ణయం - లక్ష నుంచి రెండు లక్షలకు పెంపు
పేమెంట్స్ బ్యాంక్‌లలో వినియోగదారుని
డిపాజిట్ పరిమితిని ఆర్‌బీఐ రెట్టింపు చేసింది.
పేమెంట్స్ బ్యాంక్‌లు పొదుపు ఖాతాలు మరియు చెల్లింపు సేవల ద్వారా మరింత ఆర్ధిక లక్ష్యాలను అందుకోవడానికి లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆర్థిక వ్యవస్థల విస్తరణ పెంచడానికి ఆర్‌బీఐ భారత్‌లో పేమెంట్స్ బ్యాంకులను ప్రవేశపెట్టింది.
పేమెంట్స్ బ్యాంకులు చాలా కాలంగా డిపాజిట్ పరిమితిని పెంచాలని కోరుతున్నాయి. దేశంలో డిజిటల్ చెల్లింపుల బ్యాంకులను ప్రోత్సహించే ప్రయత్నంలో, ఆర్‌బీఐ బుధవారం పేమెంట్స్ బ్యాంకుల గరిష్ట డిపాజిట్స్‌ను రూ. 2 లక్షలకు పెంచినట్లు ప్రకటించింది. అంతకుముందు ఈ గరిష్ట పరిమితి రూ. 1 లక్ష మాత్రమే.
నవంబర్ 27, 2014న జారీ చేయబడిన పేమెంట్స్ బ్యాంకుల లైసెన్సింగ్ మార్గదర్శకాల ప్రకారం ఒక్కో వినియోగదారుని గరిష్ట బ్యాలెన్స్ రూ. 1 లక్ష కలిగి ఉండటానికి ఆర్‌బీఐ అనుమతించింది. పేమెంట్స్ బ్యాంకుల పనితీరుపై సమీక్ష ఆధారంగా మరియు వారి ప్రయత్నాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆర్థిక లక్ష్యాల కోసం మరియు ఎంఎస్ఎంఈలు, చిన్న వ్యాపారులు, వ్యాపారులతో సహా వారి వినియోగదారుల అవసరాలను తీర్చగల సామర్ధ్యాన్ని విస్తరించడానికి కూడా గరిష్ట పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షలకు పెంచాలని ఆర్‌బీఐ నిర్ణయించింది.
పేమెంట్స్ బ్యాంకుల ప్రధాన లక్ష్యం వలస కార్మికులు, తక్కువ ఆదాయ గృహస్తులు, చిన్న వ్యాపారులు, ఇతర అసంఘటిత రంగ సంస్థలు, చిన్న పొదుపు ఖాతాలకు, చెల్లింపులు మరియు ఆర్థిక సేవలను అందించడం.
పేమెంట్స్ బ్యాంకులను ప్రారంభించడానికి 2015 ఆగస్టులో ఆర్‌బీఐ 11 సంస్థలకు సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. దేశంలో పేమెంట్స్ బ్యాంకును ప్రారంభించిన మొదటిది ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి) జనవరి 2017లో 2 పైలట్ బ్రాంచ్‌లలో కార్యకలాపాలు ప్రారంభించింది. ఇతర పేమెంట్స్ బ్యాంకులలో ప్రధానమైనవి `పేటిఎం` పేమెంట్స్ బ్యాంక్ మరియు `ఫినో` పేమెంట్స్ బ్యాంక్.
ఈ బ్యాంకులన్నీ ప్రస్తుతం సాధారణ
బ్యాంకులు అందించే వడ్డీ రేట్లనే అందిస్తున్నాయి. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం, పేమెంట్స్
బ్యాంకులు ఫిక్స్‌డ్ లేదా రికరింగ్ డిపాజిట్లను అంగీకరించవు. పేమెంట్స్
బ్యాంకుకు ఎలాంటి రుణం, క్రెడిట్ కార్డు ఇవ్వడానికి అనుమతి
లేదు.
0 Komentar