ఏపీ సచివాలయంలోని తెలంగాణ ఉద్యోగుల
రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర
సచివాలయంలోని సాధారణ పరిపాలన శాఖలో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన 51 మంది
ఉద్యోగుల్ని రిలీవ్ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా
క్లాస్-3,
క్లాస్-4 ఉద్యోగులు. సచివా లయం, విభాగాధిపతుల
కార్యాలయాల్లో పనిచే స్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగుల్ని వారి సొంత
రాష్ట్రానికి పంపేందుకు అంగీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ
చేసింది. దానిలో భాగంగా సాధారణ పరిపాలన శాఖలోని ఉద్యోగుల్ని రిలీవ్ చేశారు.
0 Komentar