SBI Alerts Customers on Digital Transactions
- Details here
బ్యాంక్ ఖాతాదారులకు ఎస్‌బీఐ
హెచ్చరిక - - బ్యాంక్ సంబంధిత వివరాల గురించి
అలర్ట్
మీకు స్టేట్ బ్యాంక్‌లో అకౌంట్
ఉందా?
అయితే మీరు వెంటనే ఒక పని చేయాలి. మీరు మీ మొబైల్ ఫోన్‌లో ఏమైనా
బ్యాంక్ సంబంధిత వివరాలను సేవ్ చేసుకొని ఉంటే వెంటనే వాటిని డిలేట్ చేసేయండి.
దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI తన కస్టమర్లను అలర్ట్ చేసింది. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో బ్యాంక్ తన కస్టమర్లను హెచ్చరించింది. మోసగాళ్ల బారిన పడొద్దని అప్రమత్తం చేస్తోంది. లేదంటే బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు పొగొట్టుకోవాల్సి రావొచ్చు.
మొబైల్ ఫోన్‌లో వివిధ అప్లికేషన్స్ ద్వారా బ్యాంకింగ్ సర్వీసులు పొందే వారు జాగ్రత్తగా ఉండాలని ఎస్‌బీఐ తెలిపింది. అలాగే కీలకమైన వివరాలను ఫోన్‌లో సేవ్ చేసుకోవద్దని సూచించింది. అంటే బ్యాంకింగ్ పిన్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, పాస్ వర్డ్, సీవీవీ వంటి వివరాలను ఫోన్‌లో సేవ్ చేసుకోవద్దని పేర్కొంది.
ఇలా మొబైల్ ఫోన్‌లో వివరాలు సేవ్
చేసుకునే వారు డిజిటల్ క్రైమ్ బారిన పడే అవకాశముందని ఎస్‌బీఐ పేర్కొంటోంది.
బ్యాంకింగ్ సర్వీసులకు సంబంధించిన అన్ని వివరాలను మొబైల్ ఫోన్ నుంచి డిలేట్
చేసుకోవడం మంచిదని బ్యాంక్ సూచిస్తోంది. మీరు ఇలాంటి వివరాలు ఫోన్‌లో కలిగి ఉంటే
వెంటనే తొలగించండి.
0 Komentar