SBI Customers Will Now Have to Enter OTP
To Access Their Account Online
ఎస్‌బీఐ గుడ్ న్యూస్ - మీ అకౌంట్ మరింత భద్రం -
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కొత్త సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కస్టమర్ల బ్యాంక్ ఖాతాలు మరింత భద్రంగా ఉంటాయి.
ఎస్‌బీఐ తాజాగా వన్ టైమ్ పాస్‌వర్డ్ OTP లాగిన్ ఆప్షన్ తీసుకువచ్చింది. స్టేట్ బ్యాంక్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఎస్‌బీఐ తాజా ఓటీపీ లాగిన్ ఫెసిలిటీ ద్వారా ఆన్‌లైన్ బ్యాంకింగ్ మరింత భద్రతంగా మారిందని చెప్పుకోవచ్చు. అంటే మీరు ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ లోని లాగిన్ అయ్యేటప్పుడు ముందుగా యూజర్ నేమ్, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేయాలి. తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలి. అంతేకాకుండా మీరు ప్రతి లావాదేవీకి ఓటీపీ వచ్చేలా సెట్ చేసుకోవచ్చు.
దీని కోసం మీరు ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్‌లోకి యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాలి. మై అకౌంట్స్ అండ్ ప్రొఫైల్ సెక్షన్‌లోకి వెళ్లాలి. తర్వాత హై సెక్యూరిటీ పాస్‌వర్డ్‌పై క్లిక్ చేయాలి. ప్రొఫైల్ పాస్‌వర్డ్ అవసరం అవుతుంది. ఇక్కడ మీకు రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. ఓకే చేసుకోవాలి.
ఇకపోతే ఎస్‌బీఐ ఇటీవల మరో కొత్త
సేవలు కూడా అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇకేవైసీ సర్వీసులు లాంచ్
చేసింది. దీంతో ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్ కావాలని భావించే వారు ఎక్కడికీ వెళ్లాల్సిన
పని లేదు. ఇంట్లో నుంచే అకౌంట్ తెరవొచ్చు.
SBI makes online banking safer you with our OTP based login for added security. Now bank carefree from the comfort of your home.
— State Bank of India (@TheOfficialSBI) April 23, 2021
Get started: https://t.co/8O47eWN4yG#SBI #OnlineSBI #SafeBanking pic.twitter.com/a6mVjwjYjJ
0 Komentar