SBI Offers Video KYC-Based Savings
Account Opening Feature on YONO
ఎస్‌బిఐ యోనో యాప్ తో పొదుపు ఖాతా
కోసం వీడియో కేవైసీ
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వీడియో ఆధారిత కేవైసీ (మీ ఖాతా దారు గురించి
తెలుసుకోండి) తో పొదుపు ఖాతా ప్రారంభించేందుకు అవకాశం కల్పిస్తోంది. కృత్రిమ మేధ
ఆధారంగా,
ఫేషియల్ రికగ్నైజేషన్ సాంకేతికతో, పూర్తి
కాగిత రహితంగా ఈ ప్రక్రియ ఉంటుందని, కొవిడ్-19 నేపథ్యంలో ఖాతాదారుల రక్షణను దృష్టిలో పెట్టుకుని ఈ ఏర్పాటు చేసినట్లు ఎస్
బీఐ చైర్మన్ దినేశ్ ఖారా తెలిపారు. బ్యాంకులో కొత్త పొదుపు ఖాతా
ప్రారంభించాలనుకునే వారు యోనో (YONO) యాప్ డౌన్లోడ్
చేసుకున్నాక, 'న్యూ టూ ఎస్ బీఐ'ని
ఎంపిక చేసుకుని, 'ఇన్స్టా ప్లస్ సేవింగ్ అకౌంట్ ని క్లిక్
చేయాలి. ఖాతాదారులు తమ ఆధార్ సంఖ్య నమోదు చేసి, అధీకృతం
చేయడంతోపాటు, కొన్ని వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఆ
తర్వాత వీడియో కేవైసీని పూర్తి చేసి, పొదుపు ఖాతాను బ్యాంకు
అందిస్తుంది.
0 Komentar