SBI Recruitment 2021: Applications to
Fill 148 Specialist Cadre Officer, Clerical Cadre Posts
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 148 జాబ్స్ - దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వేర్వేరు విభాగాల్లో ఖాళీగా ఉన్న 148 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్, ఫార్మాసిస్ట్, మేనేజర్, సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటీవ్, సీనియర్ ఎగ్జిక్యూటీవ్, డిప్యూటీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, డిప్యూటీ మేనేజర్, చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్, అడ్వైజర్, డేటా అనలిస్ట్ లాంటి పోస్టులున్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను https://www.sbi.co.in/ లేదా https://bank.sbi/web/careers వెబ్‌సైట్లలో చూడొచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 13న ప్రారంభమైంది. మే 3 దరఖాస్తులకు చివరి తేదీ.
ముఖ్య సమాచారం:
మొత్తం పోస్టులు: 148 (స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్లు)
అర్హత: పోస్టులను బట్టి సంబంధిత
సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్,
ఎంఎస్సీ, ఎంటెక్, ఎంసీఏ,
ఎంబీఏ, పీజీడీఎం, సీఏ
ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక: ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ
ద్వారా ఎంపిక చేస్తారు.
పరీక్ష తేది: మే 23, 2021
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష
కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు,
కర్నూలు, వరంగల్, హైదరాబాద్
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
ఏప్రిల్ 13, 2021
దరఖాస్తులకు చివరితేది: మే 3, 2021
0 Komentar