SBI Starts 3rd Edition of YONO Shopping Carnival
from Sunday
నేటి నుంచి యోనో షాపింగ్ కార్నివాల్ - మూడో ఎడిషన్‌ను ప్రారంభించిన ఎస్‌బీఐ
స్టేట్ బ్యాంక్ ఆఫ్
ఇండియా (ఎస్‌బీఐ) ఆదివారం ఏప్రిల్ 4 నుంచి యోనో షాపింగ్ కార్నివాల్‌ను ప్రారంభించనుంది. దీని
కింద డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, ఇతర
ప్రయోజనాలను అందించనుంది. యోనో వినియోగదార్ల కోసం మూడో ఎడిషన్ కింద తీసుకొస్తున్న
ఈ ‘యోనో సూపర్ సేవింగ్ డేస్’ను ఏప్రిల్ 4 నుంచి 7 వరకు కొనసాగించనున్నట్లు ఎస్‌బీఐ శనివారం తెలిపింది. మార్చి 4-7న నిర్వహించిన రెండో ఎడిషన్‌కు మంచి స్పందన రావడంతో వరుసగా మూడో నెలా
వినియోగదార్ల ముందుకు వచ్చినట్లు వివరించింది.
0 Komentar