ఏపీలో వ్యాక్సినేషన్ పర్యవేక్షణకు ప్రత్యేక యాప్
ఆంధ్రప్రదేశ్లో వ్యాక్సినేషన్
ప్రక్రియను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ను అందుబాటులోకి
తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత టీకా వేసుకున్న వైద్య సిబ్బందికి
రెండో డోసు వేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ ప్రక్రియ మొత్తాన్ని
యాప్ ద్వారా పర్యవేక్షించనున్నారు.
రేపటి నుంచి ఈ యాప్ అందుబాటులోకి
రానుందని అధికారులు తెలిపారు. లబ్ధిదారుల వివరాలను ఎప్పటికప్పుడు అధికారులు ఈ యాప్లో
పొందుపర్చనున్నారు.
రిజిస్ట్రేషన్ ఐడీ, మొబైల్
నంబర్, పేరు ద్వారా లబ్ధిదారుల వివరాలను పరిశీలిస్తారు. ఈ
నెల 20 నాటికి వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసేలా
అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు
0 Komentar