గ్రామాన్ని గణిత విజ్ఞాన వేదికగా తీర్చిదిద్దున్న
ఉపాధ్యాయులు
జగ్గయ్యపేట మండలం అన్నవరం గ్రామాన్ని గణిత విజ్ఞాన వేదికగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దుతున్నారు. సాధారణంగా పాఠశాల తరగతి గోడలు, ప్రాంగణాన్ని విద్యా సంబంధిత అంశాలతో రూపుదిద్దడం చూశాం. ఆ గురువులు మాత్రం బడితో పాటు గ్రామంలోని బస్ స్టాప్ లను , ఇంటి గోడలపై గణిత ప్రయోజన వేదిక పేరుతో గణితానికి సంబంధించి వివిధ అంశాలను రాయించి అందరినీ ఆకట్టుకుంటున్నారు.
గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత
పాఠశాల గణిత ఉపాధ్యాయుడు జ్యోతి గోవిందన్ ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
గణితానికి ఉన్న ప్రాధాన్యాన్ని అందరికీ తెలియజేయడమే లక్ష్యంగా చేపట్టిన
కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు రాఘవయ్య, శ్రీనివాసరావు సహకారం
అందించారు. మూడేళ్ల క్రితం మొదలైన వినూత్న ఆలోచన అంచెలంచెలుగా విస్తరించి
ప్రస్తుతానికి ఐదు చోట్ల గోడలపై, 2 బస్టాప్లో రాయించే వరకు
వెళ్లింది. తొలుత 2018లో బలుసుపాడు నుంచి గ్రామానికి వెళ్లే
శివారులోని మీగడ వెంకటప్పయ్య బస్ షెల్టర్ ని గణిత సమాచారంతో నింపారు. అదే
స్పూర్తిని ఇంకా కొనసాగిస్తున్నారు. ప్రధాన, సరి, బేసి సంఖ్యల ప్రాధాన్యం, అంకెలతో విన్యాసం, వివిధ సూత్రాలు, త్రికోణమితి, సమీకరణాలు,కోణాలు తదితర అంశాలను రాయిస్తున్నారు. అందుకు అయ్యే ఖర్చును ఉపాధ్యాయులే
భరిస్తున్నారు.
తాజాగా తెలంగాణ సరిహద్దులోని కీతా
నరసింహారావు బస్టాప్ ని కూడా గణిత సూత్రాలతో ముస్తాబు చేశారు.
దానిని ఇంకా ప్రారంభించాల్సి ఉంది.
ఉపాధ్యాయుల ప్రయత్నం స్ఫూర్తిదాయకమని ఎంఈఓ రవీంద్ర అభినందించారు.
0 Komentar