రేపే MPTC, ZPTC ఎన్నికలు - పరిషత్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
ఏపీలో పరిషత్ ఎన్నికలపై ఉత్కంఠ
వీడింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ
ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను
డివిజన్ బెంచ్ కొట్టేసింది. ఎన్నికలు యథాతథంగా నిర్వహించవచ్చని పేర్కొంది.
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఫలితాలను ప్రకటించవద్దని ఎస్‌ఈసీని హైకోర్టు ఆదేశించింది
★ ఎన్నికలు యథాతథంగా నిర్వహించవచ్చని
పేర్కొంది.
★ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఫలితాలను
ప్రకటించవద్దని ఎస్‌ఈసీని హైకోర్టు ఆదేశించింది.
★ ఈ కేసులో ఎస్ఈసీ తరఫున సీవీ మోహన్ రెడ్డి
వాదనలు వినిపించగా, పిటిషనర్ వర్ల రామయ్య తరపున సీనియర్
న్యాయవాది వేదుల వెంకట రమణ, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్
శ్రీరామ్ సుబ్రమణ్యం వాదనలను వినిపించారు.
★ నాలుగు వారాలు కోడ్ ఉండాలని నిబంధన లేదని
ఎస్‌ఈసీ తెలిపింది.
★ సుప్రీంకోర్టు ఏ సందర్భంలో ఆ ఉత్తర్వులు
ఇచ్చిందో పరిగణనలోకి తీసుకోలని ఎస్‌ఈసీ పేర్కొంది.
★ కోడ్ అమలుతో ప్రభుత్వ కార్యక్రమాలు
ఆగిపోతాయని సుప్రీం వ్యాఖ్యానించింది.
★ వీటిని పరిగణనలోకి తీసుకొని సింగిల్ బెంచ్
ఉత్తర్వులు కొట్టేయాలని ఎస్‌ఈసీ కోరింది.
0 Komentar