Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Touching the surface will not get you COVID, says CDC guidelines

 

Touching the surface will not get you COVID, says CDC guidelines

వస్తువులను ముడితే కరోనా అంటదు - మాస్క్ లే రక్షణ కవచాలు: అమెరికా సీడీసీ

కరోనా వచ్చిన కొత్తల్లో. మహమ్మారి మన గడపదాటి లోపలికి రాకుండా ఎన్నెన్ని చేశాం! తెచ్చుకున్న కూరగాయలు.. పండ్లను, ఉప్పు నీళ్లల్లో వేసి కడుక్కున్నాం. ఆఫీసులు, వీధులు, వెహికల్స్ శానిటైజ్ చేశాం. కారణం, వస్తువులు, బయటి ప్రాంతాల ఉపరితలాలపై వైరస్ ఉంటుందని అప్పట్లో సైంటిస్టులు చెప్పడమే. అయితే, ఇప్పుడు అదేం లేదని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) తేల్చి చెప్పింది. సర్ఫేస్ ల  మీద వైరస్ ఉనికి అంతంత మాత్రమేనని, వాటిని ముట్టు కోవడం వల్ల కరోనా సోకే ముప్పు కేవలం 0.01 శాతమేనని వెల్లడించింది.

అతి కడుగుడు అక్కర్లేదు

కరోనా భయంతో చాలా మంది ప్రమాదకరమైన కెమికల్స్, ఇతర పద్ధతుల్లోసర్ఫేస్ ల ను శుభ్రం చేస్తున్నారని, అయితే, అతికడుగుడు అక్కర్లేదని సీడీసీ సూచించింది. సర్ఫేస్ లతో వైరస్ సోకే ప్రమాదం పది వేలలో ఒక వంతు మాత్రమేనని పేర్కొంది. చేతులను మామూలుగా కడుక్కోవడం, మాస్కులు పెట్టు కోవడం, నీళ్లు, మనం ఎప్పుడూ వాడే సబ్బుతో శుభ్రం చేసుకుంటే సరిపోతుందని చెప్పింది. అంతేగానీ, డిసిన్ఫెక్టెంట్లుఅవసరం లేదని, వాటిపై హైప్ క్రియేట్ చేయడం తగదని సూచించింది.

డైరెక్ట్ కాంటాక్ట్ వల్లే కరోనా

కరోనా సోకిన వ్యక్తి నోరు లేదా ముక్కు నుంచి విడుదలయ్యే ఏరోసాల్స్ వైరతో కూడిన బిందువులు) ద్వారానే వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని సీడీసీ వెల్లడించింది. ఆ వ్యక్తితో నేరుగా కాంటాక్ట్ అయినప్పుడు మాత్రమే మహమ్మారి సోకుతుందని చెప్పింది. అందరూ కచ్చితంగా, సరైన పద్ధతిలో మాస్కులు పెట్టుకుంటే కరోనా సోకే ముప్పు తగ్గుతుందని సూచించింది. 

Previous
Next Post »
0 Komentar

Google Tags