Transfer Your Facebook Photos and Videos
to Cloud Service with a Built-in Facebook Tool
ఫేస్ బుక్ నుంచి క్లౌడ్ కు ఫొటోలు, వీడియోలు పంపించుకోండి, ఇలా!
ఫేస్ బుక్ వినియోగదారుల్లో కొందరు
పెద్ద సంఖ్యలో ఫొటోలు, వీడియోలు, మేటర్
పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఫేస్బుక్ అకౌంట్ ను డిలీట్ చేసినప్పుడు వాటన్నింటినీ
డౌన్లోడ్ చేసుకోవడం చాలా శ్రమతో కూడుకున్న పని. అలాంటి వినియోగదారుల కోసం ఫేస్ బుక్
ప్రత్యేకించి 'ట్రాన్స్ఫర్ టూల్’ ను
పరిచయం చేసింది.
దీని సహకారంతో పెద్దగా
శ్రమించకుండానే మీ యావత్తు సమాచారాన్ని ఫేస్బుక్ నుంచి మనం కోరుకున్న చోటుకు బదిలీ
చేసుకోవచ్చు.
1. ఫేస్ బుక్ తెరిచి సెట్టింగ్స్
అండ్ ప్రైవసీ ఎక్కడ ఉందో చూడండి
2. సెట్టింగ్స్ ను టాప్ చేసి,
‘యువర్ ఫేస్బుక్ ఇన్ఫర్మేషన్’ ఆప్షన్ ను చూడండి.
3. అందులోనే ట్రాన్స్ఫర్
ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ కాపీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
4. వెరిఫికేషన్ కోసం పాస్ వర్డ్ ను
రీ ఎంటర్ చేయండి.
5. పోస్టులు, ఫొటోలు,
వీడియోలు వేటిని బదిలీ చేయాలని అనుకుంటున్నారో, వాటిని ఎంపిక చేసుకోండి.
6. డ్రాప్-డౌన్ మెనూ నుంచి
ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలో ఎంచుకోండి. గూగుల్ డ్రైవ్, డ్రాప్
బాక్స్, ఇతర
క్లౌడ్ స్టోరేజ్ సర్వీసులు,
వీటిలో ఏదో ఒకటి ఎంచుకోండి.
7. కన్ఫర్మ్ చేస్తే చాలు, డేటా
బదిలీ అవుతుంది. ఫేస్ బుక్ కూడా అదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తుంది.
0 Komentar