TS: మాస్క్ ధరించకపోతే రూ.
వెయ్యి జరిమానా
కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేస్తూ ధరించని వారికి జరిమానా విధించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. మాస్క్ ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా విధించాలని డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులకు సూచించింది. జనసాంద్రత కలిగిన ప్రదేశాలు, ప్రజా రవాణా, కార్యాలయాల్లో ఈ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనా నుంచి రక్షణ పొందేందుకు
మాస్కులు పెట్టుకోవాలని వైద్యాధికారులు చెబుతున్నా కొందరు పట్టించుకోవడం లేదు.
యువత మాస్క్ లేకుండా తిరుగుతున్నారు. మాస్క్ ధరించకుంటే రూ.వెయ్యి జరిమానా
విధిస్తామని, అప్పటికీ వినిపించుకోకుంటే అంటువ్యాధుల నియంత్రణ చట్టం కింద కేసులు
నమోదు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ హెచ్చరికలన్నీ కాగితాలకే పరిమితం
కావడంతో కేసులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా జరిమానా విధించాలనే
నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. చిన్నపిల్లలు, యువత
తప్పనిసరి మాస్కు ధరించాలని, పదేళ్లలోపు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని వైద్యులు
సూచిస్తున్నారు.
Covid-19 – Disaster Management Act, 2005
– Enforcement of wearing masks – Penalty of violation – Orders – Issued
G.O.Ms.No.82 Dated: 11.04.2021
0 Komentar